ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 12, 2021, 3:47 PM IST

ETV Bharat / state

అవినీతిని ఎండగట్టినందుకు కేసులు పెడతారా..?: లోకేశ్

అనపర్తి మాజీఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అరెస్టును తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. అవినీతిని ఎండగట్టినందుకు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి తప్పుకి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రామకృష్ణా రెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

లోకేశ్
లోకేశ్

అనపర్తి మాజీఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై అక్రమ కేసులు బనాయించారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే అవినీతిని ఎండగట్టినందుకు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రామకృష్ణా రెడ్డి అరెస్టును ఖండిస్తున్నట్లు లోకేశ్ తెలిపారు. రాజారెడ్డి రాజ్యాంగంలో బాధితులకే శిక్ష అనడానికి అనపర్తి ఘటనే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు.

సంబంధం లేని కేసులో ఇరికించే ప్రయత్నాలు ఎన్ని చేసినా చివరికి న్యాయమే గెలుస్తుందని నారా లోకేశ్ పేర్కొన్నారు. కోర్టులో ఎన్నిసార్లు చివాట్లు తిన్నా కొంతమంది పోలీసులు వైకాపా నాయకులకు వంతపాడుతూనే ఉన్నారని ధ్వజమెత్తారు. ప్రతి తప్పుకి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రామకృష్ణా రెడ్డిని విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండీ... పింగళి వెంకయ్య కుమార్తెకు సీఎం జగన్ సన్మానం

ABOUT THE AUTHOR

...view details