ఫ్యాను గుర్తుకు ఓటేసిన ప్రజలు.. ఇవాళ వారి ఇళ్లల్లో ఫ్యాన్ వేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయం బాధాకరమన్న ఆయన.. ప్రభుత్వ నిర్ణయాన్ని తమ పార్టీ ఖండిస్తోందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన నాదెండ్ల.. సంక్షేమం అనే ప్రచారంతో ప్రజలను అంధకారంలోకి తోసేశారని ప్రభుత్వంపై మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రజలను వైకాపా ప్రభుత్వం నట్టేట ముంచుతోందని నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫ్యాన్‌కు ఓటేసిన వాళ్లు.. ఫ్యాన్ వేసుకోలేని పరిస్థితి: జనసేన
విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయంపై విపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిత్యావసర ధరలు, పన్నులు, విద్యుత్ ఛార్జీల భారంతో రాష్ట్ర ప్రజలను జగన్ ప్రభుత్వం నట్టేట ముంచుతోందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్నివెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఫ్యాన్‌కు ఓటేసిన వాళ్లు.. ఫ్యాన్ వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది