లంక గ్రామాల్లో మంత్రి, కలెక్టర్ పర్యటన
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని లంక గ్రామాల్లో మంత్రి, కలెక్టర్, అధికారులు పర్యటించారు.
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో గత పది రోజులుగా వరద ముంపునకు గురైన లంక గ్రామాల్లోని పంట చేళ్లను మంత్రి పినిపే విశ్వరూప్, కలెక్టర్ మురళీధర్‌రెడ్డి స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకటసతీష్, వ్యవసాయశాఖ అధికారులుతో కలసి పరిశీలించారు. నియోజకవర్గంలో వేలాది ఎకరాల్లో వారం రోజులుగా వరద నీరు నిలిచి ఉన్నందున... తొలకరిలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మంత్రి కలెక్టర్‌కు వివరించారు. ఈ ఏడాది చివర్లో ఇరిగేషన్ వ్యవసాయశాఖ అధికారులతో ముంపునకు గురికాకుండా తీసుకోవలసిన చర్యలపై ఒక నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రి జగన్‌కు అందజేయాలని అధికారులకు మంత్రి సూచించారు.