ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 16, 2020, 4:00 PM IST

ETV Bharat / state

సముద్రంలోకి గోదావరి వరద... నీట మునిగిన పంటలు

ధవళేశ్వరం బ్యారేజీ నుంచి వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ కారణంగా దిగువనున్న లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు లంకల్లో పంటలన్నీ నీట మునిగాయి. రైతులు నష్టపోయారు. ప్రభుత్వ తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

Godavari flood into the sea ... submerged crops
సముద్రంలోకి గోదావరి వరద... నీట మునిగిన పంటలు

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీకి అంతకంతకూ పెరుగుతున్న గోదావరి వరదను సముద్రంలోకి వదలడంతో దిగువనున్న లంక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయల తోటలు ముంపునకు గురయ్యాయి. ముమ్మిడివరం మండలం పరిధిలోని గురజాపు లంక, లంకాఫ్ ఠాణ్ణేలంక, కూనాలంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి లంకలోని వంగ, మునగ, బెండ, ఆనబ, మిర్చి తోటలు వరద నీటిలో మునిగి పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. ముంపు గ్రామాల ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details