ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోదావరి ఉద్ధృతి.. నీట మునిగిన పొలాలు

గోదావరికి వరద నీరు పోటెత్తుతోంది. తూర్పు గోదావరి జిల్లాలోని మండలాల్లోని పంటలు పూర్తిగా నీట మునిగాయి. వరద నీటికి పంటలు పాడైపోతున్నా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నామని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

fllods in godavari
నీట మునిగిన పంట పొలాలు

By

Published : Aug 18, 2020, 3:02 PM IST

గోదావరికి వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. తూర్పు గోదావరి జిల్లాలోని లంక ప్రాంతాలు, బ్యారేజీ దిగువన ఉన్న పొలాలు నీట మునిగాయి. ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, ఆలమూరు, కపిలేశ్వరపురం మండలాల్లోని .. కొబ్బరి, మామిడి, అరటి, కంద, కూరగాయలు, మునగ, బొప్పాయి తోటలు నీటిలో తేలియాడుతున్నాయి.

లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టిన పంటలు కళ్ళ ఎదురుగానే పాడై పోతున్నా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు నాలుగైదు రోజులు ఇలాగే ఉంటే పంటలు కుళ్లిపోయే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details