ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉండి తీరుతుందని మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. దీనిపై హైకోర్టు స్టేటస్ కో ఇవ్వడం మొదటి విజయంగా అభిప్రాయపడ్డారు. అమరావతికి మద్దతుగా న్యాయస్థానం స్టేటస్ కో ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తూర్పుగోదావరి జిల్లా తాటిపాకలో రెండోరోజు దీక్ష చేపట్టారు. సూర్యారావు మాట్లాడుతూ.. ఆరేళ్లుగా అమరావతిలో పాలన జరుగుతుంటే.. ఇప్పుడు వైకాపా ప్రభుత్వం మూడు రాజధానులనడం అన్యాయమన్నారు. రాజ్యాంగానికి లోబడి చంద్రబాబునాయుడు అమరావతిని ఏర్పాటు చేశారని స్పష్టం చేశారు. సీఎం జగన్ ఎన్ని ఎత్తుగడలు వేసినా రాజధానిని తరలించడం సాధ్యం కాదన్నారు.
రాజధానిగా అమరావతే ఉంటుంది: గొల్లపల్లి సూర్యారావు
రాజ్యాంగబద్ధంగా చంద్రబాబునాయుడు అమరావతిని రాజధానిగా ఎంపిక చేస్తే.. నేడు సీఎం జగన్ మూడు రాజధానులనడం అన్యాయమని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉంటుందని స్పష్టం చేశారు.
గొల్లపల్లి సూర్యరావు, మాజీ మంత్రి