ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తూ జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కోరారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి ఆలస్యం అవుతుండటం వలన యాజమాన్యాలు జీతాలు చెల్లించడం లేదన్నారు. కొన్ని సంస్థలు సగం జీతాలు చెల్లిస్తున్నా ముందు ముందు అవీ ఇచ్చే పరిస్థితులు లేవన్నారు. ప్రైవేటు ఉపాధ్యాయుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులును.. దృష్టిలో పెట్టుకొని వారికి ప్రభుత్వం సాయం అందించాలన్నారు.
'ప్రైవేట్ ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలి' - ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలు
ప్రైవేట్ పాఠశాలల్లో, కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కోరారు. కొన్ని యాజమాన్యాలు జీతాలు చెల్లించడం లేదన్నారు.

కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
Last Updated : Jul 15, 2020, 3:13 PM IST