ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మండపేట విభాగం తరఫున.. వైద్యులు లక్షా 50 వేల రూపాయల మొత్తాన్ని.. ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందించారు. ఈ చెక్కును ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు అందజేశారు. కరోనా నుంచి రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు తమవంతు సహాయం చేసినట్లు సంస్థ అధ్యక్షులు డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి తెలిపారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వైద్యులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని ఉప ముఖ్యమంత్రి కొనియాడారు.
సీఎంఆర్ఎఫ్కు మండపేట ఐఎమ్ఏ విరాళం రూ. 1.5 లక్షలు - ముఖ్యమంత్రి సహాయనిధికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విరాళం
కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్యులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని.. ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చిన లక్షా 50 వేల రూపాయల మొత్తాన్ని ఆయన అందుకున్నారు.

ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు చెక్కు అందిస్తున్న ఐఎమ్ఏ అధ్యక్షుడు