మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లు అతివేగం కారణంగా ఒక వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. మట్టి ట్రాక్టర్ల వేగానికి కళ్లెం వేయాలని ప్రజలు కోరుతున్నారు. తూర్పగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో ఇళ్ల స్థలాలు మెరక చేసేందుకు ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. గూడపాటి ఆంజనేయులు అనే వ్యక్తి సైకిల్‌పై వస్తుండగా మట్టి ట్రాక్టర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో రావులపాలెంలోని ఒక ప్రైవేటు ఆసుప్రతికి తరలించారు. ట్రాక్టర్లు వేగంగా నడపడం వల్ల భయబ్రాంతులకు గురవుతున్నామని అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ట్రాక్టర్ అతివేగానికి... సైకిల్‌పై వెళ్లే వ్యక్తికి గాయాలు - tractor dashes to cycle news in east godavari dst
ట్రాక్టర్ల అతివేగం కారణంగా తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఇళ్ల స్థలాలు మెరక చేసేందుకు మట్టితో వెళుతున్న ట్రాక్టర్లు అతివేగంగా మనుషులపైకి దూసుకొస్తున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు.

due to high speed of tractor dashed to the man in east godavari dst