తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలంలోని గేదెల్లంక, పశువుల్లంక, ముమ్మిడివరం మండలంలోని పల్లంవారిపాలెం, ఠాణేల్లంక, గురజాపులంక గ్రామాలచుట్టూ వరదనీరు చేరింది. ధవళేశ్వరంలో వరద తగ్గముఖం పట్టినా..సముద్రంలోకి నీరు వదలటంతో అనేక లంకభూములు ముంపునకు గురయ్యాయి. వేల ఎకరాల్లోని కూరగాయలు, ఆకుకూరల మడులు వరదనీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరదనీటిలోనే కొంతవరకూ పంటను కోసుకుని ఒడ్డుకు చేరుస్తున్నారు. వరద తగ్గినా బురద పేరుకుపోయి మిగిలిన పంట చేతికి రాదని ఆవేదన చెందుతున్నారు.
East Godavari: గోదారిలో సిత్రాలు...ఓవైపు మడులు మునక..మరోవైపు తెరచాప నావ కనువిందు
తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి వరద నీరు చేరి వేల ఎకరాల కూరగాయలు, ఆకుకూరల మడులు నీట మునిగాయి. నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పి.గన్నవరం మండలం బెల్లంపూడి వద్ద వశిష్ఠ గోదావరి నది పాయల వరదనీటిలో జాలరి తెరచాప నావతో వెళుతున్న దృశ్యం కనువిందు చేసింది.
గోదారిలో ఓవైపు మడులు మునక...మరోవైపు తెరచాప నావ కనువిందు
పి.గన్నవరం మండలం బెల్లంపూడి వద్ద వశిష్ఠ గోదావరి నది పాయలు జోరుగా ప్రవహిస్తుంది. ఈ వరదనీటిలో జాలరి తెరచాప నావతో వెళుతున్న దృశ్యం కనువిందు చేసింది. జోరుగా ప్రవహిస్తున్న గోదావరి వరద నీటిలో కనిపించిన ఈ దృశ్యాలను ఈటీవీ భారత్ కెమెరాలో బంధించింది.
ఇదీ చదవండి: వరద ప్రవాహంతో అల్లాడుతున్న కోనసీమ ప్రాంతాలు..