తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరంలో ఓ మహిళకు కరోనా పాజిటివ్ అని ఫలితం రావడంపై.. అధికారులు అప్రమత్తం అయ్యారు. తిరుపతి నుంచి వచ్చిన ఆమెను ముందుగా.. 14 రోజుల పాటు భీమవరం క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు.
అనంతరం పరీక్షలు చేయగా కరోనా నెగెటివ్ రావటంతో ఇంటికి పంపారు. మరో 14 రోజులు హోం క్వారంటైన్లో ఉంచారు. తర్వాత పరీక్షలు చేయగా కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేశారు.