ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తూర్పు గోదావరి జిల్లాలో కరోనా.. యానాంలో టెన్షన్ టెన్షన్ - యానాంలో లాక్ డౌన్

తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. సమీపంలోని కేంద్ర పాలిత ప్రాంతం యానాం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అక్కడ పోలీసులు లాక్ డౌన్​ను కఠినతరం చేశారు.

corona effect on yanam
యానాంలో లాక్ డౌన్ కఠిన తరం

By

Published : May 12, 2020, 7:04 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో గత 2 రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నందున... సమీపంలో ఉన్న యానాంలో లాక్ డౌన్ కఠినతరం చేశారు. యానాంలో ఉంటూ.. తూర్పుగోదావరిలో విధులు నిర్వర్తించే వారు ప్రభుత్వ అనుమతి పత్రం తీసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. యానాం వాసులు ఊరిలో తిరగాలన్నా గుర్తింపు కార్డు తప్పనిసరి చేశారు.

నిత్యావసర సరుకుల కొనుగోలుకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే అనుమతి ఇస్తున్నారు. నిబంధనలు అతిక్రమించి బయటకు వస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ముఖానికి మాస్కు లేకుండా వచ్చే వారి నుంచి రూ. 100 జరిమానా వసూలు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details