'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం కొమరగిరిలో వైఎస్‌ఆర్ జగనన్న ఇళ్ల పట్టాల పైలాన్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ముందు కొమరగిరిలో నమూనా ఇంటిని సీఎం జగన్ పరిశీలించారు. 15 రోజులపాటు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. 30.75 లక్షల మందికి 'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది.
'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' పథకం ప్రారంభించిన సీఎం జగన్
తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం కొమరగిరిలో వైఎస్‌ఆర్ జగనన్న ఇళ్ల పట్టాల పైలాన్‌ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. 30.75 లక్షల మందికి 'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది.
వైఎస్‌ఆర్ జగనన్న ఇళ్ల పట్టాల పైలాన్‌ను ప్రారంభించిన సీఎం జగన్
గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో సెంటు భూమి కేటాయించనున్నారు. మొత్తం 68,361 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల రూపంలో నిరుపేదలకు అందించనున్నారు. తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చూట్టింది.
ఇదీ చదవండి: చిన్న బాధ ఉంది'... సీఎం జగన్ భావోద్వేగం
Last Updated : Dec 25, 2020, 2:25 PM IST