కరోనా మహమ్మారిపై ప్రభుత్వాలు చేస్తున్న యుద్ధానికి తమవంతు కర్తవ్యంగా దాతలు, పలు స్వచ్చంద సంస్థలు సాయం చేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలో చర్చ్ ఆఫ్ క్రీస్ట్ స్వచ్ఛంద సంస్థ లక్ష రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించింది. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి చర్చ్ ఆఫ్ క్రీస్ట్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు పీయస్ఆర్.జయపాల్, ఉపాధ్యక్షులు పల్నాటి ప్రవీణ్ లక్ష చెక్ ను అందించారు.
సీఎం సహాయనిధికి చర్చ్ ఆఫ్ క్రీస్ట్ స్వచ్ఛంద సంస్థ లక్ష విరాళం - Church of Christ charity donated one lakh to cm relief fund at atreyapuram
ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కోవిడ్-19 నియంత్రణకు ఎంతోమంది దాతలు విరాళాలు అందిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలో చర్చ్ ఆఫ్ క్రీస్ట్ స్వచ్ఛంద సంస్థ లక్ష రూపాయల సాయాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించింది.

సీఎం సహాయనిధికి చర్చ్ ఆఫ్ క్రీస్ట్ స్వచ్ఛంద సంస్థ లక్ష విరాళం