సీఎం జగన్ సంప్రదాయాలు పాటించడం లేదని.. హిందూ దేవాలయాలపై మంత్రులతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడిస్తున్నారని మాజీ హోంమంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప ఆరోపించారు. తిరుమలలో సంప్రదాయాలకు తిలోదకాలు వదిలి పట్టు వస్త్రాలు సమర్పించారని అన్నారు. ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నా.. నిందితుల్ని పట్టుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'తిరుమల సంప్రదాయాలకు సీఎం తిలోదకాలు' - దేవాలయాలపై దాడుపై చినరాజప్ప
సీఎం జగన్.. తిరుమలలో సంప్రదాయాలకు తిలోదకాలు వదిలిపెట్టారని తెదేపా ఎమ్మెల్యే చినరాజప్ప అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా పిలుపు మేరకు చినరాజప్ప పెద్దాపురం మరిడమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు.

పెద్దాపురం మరిడమ్మ ఆలయంలో చినరాజప్ప పూజలు
కరోనాతో ఆసుపత్రుల్లో వైద్యం అందక జనం పడరాని పాట్లు పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. పెట్రోలు, నిత్యావసర ధరలు పెరిగి విలవిలలాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తెదేపా పిలుపు మేరకు చిన రాజప్ప పెద్దాపురం మరిడమ్మ ఆలయంలో పూజలు చేశారు.
ఇదీ చదవండి: రాజధాని అంశంపై సీఎంకు లేఖ రాస్తా: కేంద్రమంత్రి అథవాలే