ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: భూమన - భూమన కరుణాకరరెడ్డి

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యుడిని అనిపించుకోవటం తప్ప...మంత్రి పదవి సహా తనకు మరే పదవులపై ఆశలేదని తిరుపతి శాసనసభ్యుడు..వైకాపా సీనియర్ నేత భూమన కరుణాకరరెడ్డి అన్నారు.

ysrcp-bhumana

By

Published : Jun 6, 2019, 3:15 PM IST

పదవులపై ఆశక్తి లేదు:భూమన కరుణాకరరెడ్డి

తిరుపతిలో నిర్వహించిన వైకాపా కార్యకర్తలు ఆత్మీయ సమావేశంలో వైకాపా సీనియర్ నేత భూమన కరుణాకరరెడ్డి పాల్గొన్నారు.ఆయన తన విజయానికి సహకరించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యుడిని అనిపించుకోవటం తప్ప...మంత్రి పదవి సహా తనకు మరే పదవులపై ఆశలేదని తెలిపారు.తెదేపా బలంగా ఉన్న తిరుపతిలో ఘన విజయం సాధించటం చిన్న విషయం కాదన్న భూమన......తిరుమల శ్రీవారికి ప్రతినిధిగా ఉండటం కంటే పెద్దపదవేమీ ఉండదన్నారు.వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయనని స్పష్టం చేసిన కరుణాకరరెడ్డి......తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేలా ఈ ఐదేళ్లు పరిపాలన సాగిస్తానన్నారు.

ABOUT THE AUTHOR

...view details