ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వర్చువల్ లోక్ అదాలత్​ల నిర్వహణకు సుప్రీం ఆదేశాలు - పుత్తూరు సబ్ కోర్టులో లోక్ అదాలత్

కొవిడ్ మహమ్మారి ధాటికి ఏడు నెలలుగా న్యాయశాఖ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అత్యవసర కేసులను మాత్రమే దృశ్య శ్రవణ పద్ధతిలో న్యాయమూర్తులు విచారణకు స్వీకరించారు. సుప్రీం ఆదేశాలతో అదే విధానంలో చిత్తూరు జిల్లా పుత్తూరులో లోక్ అదాలత్ ప్రారంభమైంది.

virtual lok adalat
దృశ్య శ్రవణ విధానంలో లోక్ అదాలత్

By

Published : Oct 17, 2020, 3:34 PM IST

చిత్తూరు జిల్లా పుత్తూరు సబ్ కోర్టు ఆవరణలో ఈరోజు వర్చువల్ లోక్ అదాలత్ నిర్వహించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సూచనల మేరకు ఈ కార్యక్రమం ప్రారంభించామని సీనియర్ సివిల్ జడ్జి మురళీధర్ తెలిపారు. కరోనా వ్యాప్తి ధాటికి 7 నెలలుగా వివిధ కేసులు విచారణ జరగక పెండింగ్​లో ఉన్నాయని న్యాయమూర్తి పేర్కొన్నారు.

రాజీ కుదుర్చుకునేందుకు మొగ్గుచూపుతున్న కక్షిదారులతో మాట్లాడి వివాదాలను పరిష్కరించాలని సుప్రీం కోర్టు ఆదేశించిందని తెలిపారు. దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని.. ఈ అవకాశాన్ని ఆసక్తి కలిగిన వారులు వినియోగించుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details