తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు - gali janardhan
తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, సినీనటుడు మోహన్ బాబు, మిజోరం మాజీ గవర్నర్ వినోదకుమార్ దుగ్గల్ విడివిడిగా దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.

vips-visit-ttd
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సినీనటుడు మోహన్ బాబు, మిజోరం మాజీ గవర్నర్ వినోద్‌కుమార్ దుగ్గల్, మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి విడివిడిగా దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ప్రముఖులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. తన కోరిక ఫలించడంతో ఏడాదిన్నర తర్వాత తిరుమలేశుని దర్శనం కోసం వచ్చినట్లు మోహన్ బాబు తెలిపారు.