చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం నాయినంపల్లి గ్రామంలో విషాదం జరిగింది. రెండేళ్ల చిన్నారి కావ్యశ్రీ ప్రమాదవశాత్తూ నీటి సంపులో పడి మృతి చెందింది. చిన్నారి ఆడుకుంటూ ఇంటి ఎదురుగా ఉన్న మరో ఇంటి నీటిసంపులో పడి మృతి చెందినట్లు సీఐ ఆశీర్వాదం తెలిపారు. ఒక్కగానొక్క కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
నీటి సంపులో పడి రెండేళ్ల చిన్నారి మృతి
ఇంటి ముందు ఆడుకుంటూ... ప్రమాదవశాత్తూ నీటి సంపులో పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ విషాదకర ఘటన చిత్తూరు జిల్లా నాయినంపల్లి గ్రామంలో జరిగింది.
నీటి సంపులో పడి రెండేళ్ల చిన్నారి మృతి