ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈనెల 12నుంచి మాఘ మాహోత్సవాలకు తితిదే సన్నాహాలు

మాఘ మాహోత్సవం సందర్భంగా ఈనెల 12నుంచి మార్చి 13 వరకు తెలుగు రాష్ట్రాల్లో పలు ధార్మిక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తితిదే ఈఓ జవహర్ రెడ్డి తెలిపారు. ప‌రిపాల‌నా భవనంలో డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

ttd preparations for  Magha Mahotsavam
తితిదే సన్నాహాలు

By

Published : Feb 5, 2021, 5:37 PM IST

మాఘ మహోత్సవం పేరిట శ్రీవారి ఆలయంలో పలు పూజలు, ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తితిదే ఈఓ జవహర్ రెడ్డి అన్నారు. తితిదే ప‌రిపాల‌నా భవనంలో డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. చరవాణి ద్వారా భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈనెల 12నుంచి మార్చి13 వరకు తెలుగు రాష్ట్రాల్లో పలు ధార్మిక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.

తిరుమల నాదనీరాజనం వేదికపై మాఘపురాణ ప్రవచనం, ధర్మగిరి వేద పాఠశాలలో మాఘ భానుపూజ, తిరుపతి ధ్యానారామంలో కుంద చతుర్థి, నెల్లూరులో వసంతపంచమి మహోత్సవం, తిరుమలలో భీష్మ ఏకాదశి, సుందరకాండ పఠనం, విష్ణుసహస్రనామ పారాయణం చేపడతామన్నారు. ఫిబ్రవరి 27న తెలంగాణలోని కాళేశ్వరం త్రివేణి సంగమంలో మాఘపూర్ణిమ పుణ్యస్నానం నిర్వహించనున్నట్లు ఈఓ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'శ్రీవారి ఆర్జిత సేవలకు మార్చి నుంచి పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతి'

ABOUT THE AUTHOR

...view details