ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిలిచిన తితిదే ధర్మకర్తల మండలి సమావేశం - తితిదే ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్

నాటకీయ పరిణామాల మధ్య తితిదే ధర్మకర్తల మండలి సమావేశం నిలిచిపోయింది. సమావేశం నిర్వహించాలన్న సమాచారంతో ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన అన్నమయ్య భవన్​లో ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభమైంది.

ttd_board_meeting_stop

By

Published : May 28, 2019, 12:01 PM IST

Updated : May 28, 2019, 12:32 PM IST

నాటకీయ పరిణామాల మధ్య నిలిచిన తితిదే ధర్మకర్తల మండలి సమావేశం

తితిదే ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం ఏర్పాటు చేశారు. కొంత సమయానికి సమావేశం నుంచి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాస రాజు బయటకు వెళ్లిపోయారు. మళ్లీ వారు తిరిగి రాకపోవడం కారణంగా సమావేశాన్ని విరమిస్తున్నట్లు పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. బోర్డుకు తితిదే పాలకమండలి సభ్యులు చల్లా రామచంద్రారెడ్డి, పొట్లూరి రమేష్ బాబు రాజీనామా చేశారు. శ్రీవారి సన్నిధిలో స్వచ్ఛందంగా తమ పదవులకు రాజీనామా చేయలేమన్న తితిదే ఛైర్మన్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని వెల్లడించారు.

Last Updated : May 28, 2019, 12:32 PM IST

ABOUT THE AUTHOR

...view details