ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కారణం చెప్పకుండా అరెస్ట్ చేశారు.. ఇదంతా రాజకీయ కక్ష సాధింపే' - తెదేపా నేత రమేష్ రెడ్డిని అరెస్ట్ చేసి పుంగనూరు కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు

రాజకీయంగా కక్ష సాధించేందుకే తమ పార్టీ నేత రమేష్ రెడ్డిని అరెస్ట్ చేశారంటూ.. తెదేపా నేతలు నిరసన చేపట్టారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండల తెదేపా అధ్యక్షుడిని.. కనీసం కారణం చెప్పకుండా అరెస్ట్​ చేయడం ఏంటని ప్రశ్నించారు.

tdp cadre protest at punganuru against party mandal president arrest
తెదేపా మండల అధ్యక్షుడి అరెస్ట్​ను నిరసిస్తూ పుంగనూరులో పార్టీ శ్రేణుల ధర్నా

By

Published : Mar 1, 2021, 7:09 AM IST

తెదేపా మండల అధ్యక్షుడి అరెస్ట్​ను నిరసిస్తూ పుంగనూరులో పార్టీ శ్రేణుల ధర్నా

చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండల తెదేపా అధ్యక్షుడు రమేష్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ.. పుంగనూరులో ఆ పార్టీ నాయకులు ధర్నాకు దిగారు. కారణం చెప్పకుండా అదుపులోకి తీసుకున్నారంటూ ఆగ్రహించారు.

రాజకీయ కక్ష సాధింపుతోనే ఇలా వ్యవహరిస్తున్నారన్నారు. అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతోనే ఇదంతా జరిగిందన్నారు. ఓ కేసు విషయంలో రమేష్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కోర్టులో హాజరు పరిచారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details