చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఎనిమిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, ప్రత్యేక క్యూలైన్లు, అన్నవితరణ కేంద్రాలు సిద్ధం చేశారు. రేపు ఉదయం ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు స్వామి వారు వివిధ వాహన సేవల్లో దర్శనమివ్వనున్నారు.
శ్రీనివాస మంగాపురం బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి - ఆంధ్రప్రదేశ్లోని ప్రఖ్యాత వెంకటేశ్వరస్వామి ఆలయాలు
చిత్తూరు జిల్లా శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

రేపటి నుంచి శ్రీనివాస మంగాపురం బ్రహ్మోత్సవాలు
శ్రీనివాసమంగాపురం బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ఇదీ చదవండి:
ఘనంగా ప్రారంభమైన నల్లవీర గంగమ్మ జాతర