ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీవారి సేవలో శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స - శ్రీవారి సేవలో శ్రీలంక ప్రధాని

తిరుమల శ్రీవారిని వీఐపీ దర్శన సమయంలో శ్రీలంక ప్రధాని మంత్రి దర్శించుకున్నారు. వీరితో పాటు పలువురు ప్రముఖులు స్వామివారి సేవలో పాల్గొన్నారు.

vips in tirumala
శ్రీవారి సేవలో ప్రముఖులు

By

Published : Feb 11, 2020, 10:25 AM IST

Updated : Feb 11, 2020, 11:05 AM IST

శ్రీవారి సేవలో శ్రీలంక ప్రధాని

శ్రీలంక ప్రధానమంత్రి మహింద రాజపక్స తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుమారుడు యోషిత రాజపక్స, అక్కడి మంత్రి ఆర్ముగన్ తొండమాన్​తో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. మహద్వారం వద్దకు చేరుకున్న రాజపక్సకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తితిదే ఈవో అనిల్​కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శనానికి ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికారు. శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బాలరాజు, మాజీమంత్రి వినోద్, డ్రమ్స్ కళాకారుడు శివమణి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఇదీ చదవండి:తిరుమలకు శ్రీలంక ప్రధాని.. శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు

Last Updated : Feb 11, 2020, 11:05 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details