చిత్తూరు జిల్లా మల్లయ్యకొండ శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. రాయలసీమ నుంచే కాక కర్ణాటక రాష్ట్రం నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని సంకల్పించి 'మల్లికార్జున స్వామి' వెబ్సైట్ను స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ప్రారంభించారు. కొండ కింద శ్రీమల్లికార్జున స్వామి సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. పలువురు దాతలు భక్తులకు చల్లని పానీయాలు, అల్పాహారం, ఉచిత రవాణా వంటి సదుపాయాలు కల్పించారు. ఆలయ ప్రాగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వేడుకలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
మల్లయ్యకొండలో శివరాత్రి ఉత్సవాలు
చిత్తూరు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం మల్లయ్యకొండలో శివరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు.
మల్లయ్యకొండలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు
TAGGED:
ap famoud temples