చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో పోలీసులు ఎర్రచందనం దుంగలు పట్టుకున్నారు. చిత్తూరు-గుడియాత్తమ్ రోడ్డు ఓటేరుపల్లి క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా... వేగంగా వస్తున్న ఐషర్ వ్యాన్ను తనిఖీ చేశారు. అందులో 10 క్వింటాళ్ల 270 కిలోల బరువు ఉన్న 45 ఎర్రచందనం దుంగలున్నాయి. వీటి విలువ సుమారు రూ.54 లక్షలు ఉంటుందని ఏఎస్పీ క్రిష్ణార్జున్ రావు తెలిపారు. అక్రమంగా ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు.
'రూ.54 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం' - red sandalwood logs
చిత్తూరు-గుడియాత్తమ్ రోడ్డు ఓటేరుపల్లి క్రాస్ వద్ద 10 క్వింటాళ్ల 270 కిలోల బరువు ఉన్న 45 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ క్రిష్ణార్జున్ రావు.
54లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం