చిత్తూరు జిల్లా పులిచర్ల మండల కేంద్రంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. పులిచర్లలో నూతనంగా నిర్మిస్తున్న మండల కార్యాలయాల కాంప్లెక్స్ నిర్మాణ పనులను ఆయన పర్యవేక్షించారు. పంచాయతీరాజ్ నిధులతో నిర్మిస్తున్న... ఎంపీడీవో, ఎమ్మార్వో నూతన కార్యాలయ భవనాల నిర్మాణ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంచాయితీ, మండల వ్యవస్థలను బలోపేతం చేసేలా... త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
పులిచర్లలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన - పులిచర్లలో మంత్రి పెద్దిరెడ్డి
చిత్తూరు జిల్లా పులిచర్లలో నిర్మిస్తున్న ఎంపీడీవో, ఎమ్మార్వో నూతన కార్యాలయ భవన పనులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆరా తీశారు. త్వరతిగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

పులిచర్లలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన