ఆంధ్రుల రాజధాని అమరావతిలోనే కొనసాగేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవాలని... తెదేపా, జనసేన నేతలు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం మండల కేంద్రంలోని గాండ్ల మిట్ట కూడలి వద్ద నేతలు రాజధాని రైతులకు మద్దతుగా నిరసన దీక్ష చేపట్టారు. నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ యుగంధర్ పొన్న ఆధ్వర్యంలో జరిగిన దీక్షకు కార్వేటినగరం మండల తెదేపా నేతలు సంఘీభావం తెలిపారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాలు మూలనపడ్డాయి అంటూ నినాదాలు చేశారు. నవరత్నాలు నేల రాలి పోయాయని ఎద్దేవా చేశారు. కేవలం వ్యక్తిగత కక్షలతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేస్తుందని, తన నిర్ణయాన్ని వెంటనే మార్చుకోవాలని సూచించారు.
రాజధాని రైతులకు చిత్తూరు జిల్లా మద్దతు - ఆంధ్రుల రాజధాని అమరావతి లోనే కొనసాగించాలి
రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ... రైతులకు మద్దతుగా తెదేపా, జనసేన నేతలు చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్ హిట్లర్ పాలన చేస్తున్నారని...ఇప్పటికైనా పద్దతి మార్చుకోకపోతే తనకే నష్టమని వారు హెచ్చరించారు.

రాజధాని రైతులకు మద్దతుగా తెదేపా, జనసేన నిరసన
రాజధాని రైతులకు మద్దతుగా తెదేపా, జనసేన నిరసన
ఇవీ చదవండి...'నేను కాదు.... ఆ మంత్రులే పెయిడ్ ఆర్టిస్టులు'
TAGGED:
jenasena tdp protest