చిత్తూరు జిల్లా నాయుడుపేట - పూతలపట్టు జాతీయ రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు. రహదారిని నాలుగు లైన్లకు విస్తరిస్తూ నిర్మాణాలు చేపట్టిన సమయంలో వరద నీరు వెళ్లటానికి వీలు లేకుండా నిర్మాణాలు చేశారని రైతులు ఆరోపించారు. గుత్తేదారు నిర్లక్ష్యంతో తమ పంట పొలాలు నీట మునుగుతున్నాయని ఆందోళనకు దిగారు. వర్షపునీరు వెళ్లిపోయేలా చర్యలు చేపట్టాలని అధికారులకు, గుత్తేదారుకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
జాతీయ రహదారిపై రైతుల ఆందోళన - నాయుడు పేటలో రైతుల నిరసన
చిత్తూరు జిల్లా నాయుడుపేట - పూతలపట్టు జాతీయ రహదారిపై రైతులు నిరసన చేపట్టారు. రహదారిని విస్తరణ సమయంలో వరద నీరు వెళ్లటానికి వీలు లేకుండా నిర్మాణాలు చేపట్టారని విచారం వ్యక్తం చేశారు. అధికారులకు, గుత్తేదారుకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

నాయుడపేటలో జాతీయ రహదారిపై రైతుల ఆందోళన
రహదారి నిర్మాణం కోసం తమ నుంచి భూములు సేకరించిన అధికారులు వరదనీరు పారేందురు కల్వర్ట్ నిర్మించలేదని రైతులు వాపోతున్నారు. పొలాల ఎగువ ప్రాంతంలో ఉన్న పది చెరువుల నుంచి నీరు కిందకు వస్తున్నా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: విజయవాడ దుర్గ గుడి పాలకమండలి సభ్యురాలు రాజీనామా