చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాల్లో గజరాజులు రైతుల కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. సోమల మండలంలోని అడవిలో 17ఏనుగులున్న సమూహం సంచారం చేస్తోంది. రాత్రిపూట వరి, మామిడి తోటలను నాశనం చేస్తున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవలకుప్పం, బయరెడ్డిపల్లి, రామకృష్ణ రెడ్డి గ్రామాల్లో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. రెవెన్యూ, అటవీశాఖ అధికారులకు విషయం తెలపడంతో సంయుక్తంగా పంట నష్టపరిహారాన్ని అంచనా వేశారు. ఇప్పటికైనా అటవీశాఖ ఉన్నతాధికారులు స్పందించి ఏనుగుల బెడద నుంచి పంట పొలాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
ఏనుగుల గుంపు బీభత్సం.. అన్నదాతల భయాందోళన - సోమల వార్తలు
చిత్తూరు జిల్లా పడమటి మండలాల్లో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. వరి, మామిడి తోటలు తదితర పంటలను నాశనం చేస్తున్నాయి. అటవీశాఖ ఉన్నతాధికారులు స్పందించి ఏనుగుల బెడద నుంచి కాపాడాలని రైతులు కోరుతున్నారు.

ఏనుగుల గుంపు బీభత్సం
TAGGED:
somala news