ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కక్ష సాధించేందుకే అన్న క్యాంటీన్ల మూసివేత' - CPI Ramakrishna comments on cm

రాష్ట్రం, కేంద్రంలో ప్రభుత్వాలు మొండి వైఖరిని ప్రదర్శిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. తెదేపాపై కక్ష సాధించేందుకే పేదలకు రూ.5కే అన్నం పెట్టే అన్న క్యాంటీన్‌లను జగన్‌ సర్కార్‌ మూసేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా తిరుపతిలో సీపీఐ నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

By

Published : Feb 22, 2020, 10:03 PM IST

మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

రాష్ట్రంలో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి నిరంకుశ పాలన సాగిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా సీపీఐ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వాలు మొండి వైఖరిని ప్రదర్శిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని రామకృష్ణ దుయ్యబట్టారు. కృష్ణానది కరకట్టపై అక్రమ నిర్మాణాలను తొలగిస్తానని ప్రజావేదికను కూల్చేసిన సీఎం జగన్​.. ఆ తర్వాత ఎందుకు ఒక్క భవంతిని తొలగించలేదన్నారు. కరకట్టపై ఉన్న భాజపా మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ఇంటిని తొలగించే ధైర్యం సీఎంకు ఉందా? అని ప్రశ్నించారు. తెదేపాపై కక్ష సాధించేందుకే పేదలకు రూ.5కే అన్నం పెట్టే అన్న క్యాంటీన్‌లను జగన్‌ సర్కార్‌ మూసేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని మహిళా రైతులు 66 రోజులుగా దీక్షలు చేస్తుంటే.. వారిపై అవమానకరంగా ప్రవర్తిస్తూ తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు.

ఇదీ చూడండి:'అమరావతి రైతుల మరణాలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే'

ABOUT THE AUTHOR

...view details