కరోనా టీకా ఇవ్వడానికి ఏర్పాటు చేసిన కొవిన్ సాప్ట్వేర్ పరిశీలన కోసం చిత్తూరు జిల్లాలో నిర్వహించిన రెండో విడత డ్రైరన్ విజయవంతమైంది. కరోనా టీకా కేంద్రాలను పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను నిమమించినట్లు సంయుక్త కలెక్టర్ వీరబ్రహ్మం తెలిపారు. టీకాలను నిల్వ చేయడానికి అవసరమైన రిఫ్రిజిరేటర్, ఐస్ప్యాకులను అందుబాటులో ఉంచామని చెప్పారు.
తొలి విడతలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులతో పాటు ఆరోగ్య సిబ్బందికి టీకా వేయనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 32 వేల మందిని గుర్తించామని వారికి సంబంధించిన సమాచారాన్ని కొవిన్ సాప్ట్‌వేర్‌లో పొందుపరిచామని వివరించారు. కరోనా టీకా వేయాల్సిన వారికి సంక్షిప్త సమాచారం వెళ్లేలా ఏర్పాటు చేశామని ఆయన అన్నారు.