ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న (బూత్ లెవల్ ఆఫీసర్) బీఎల్వో లను ఆదేశించారు. నియామవళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తంబళ్లపల్లి... మదనపల్లి... పీలేరు నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణపై అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ... సమష్టిగా పనిచేయాలని సూచించారు. దేశంలోనే చిత్తూరు జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని విజ్ఞప్తి చేశారు.
'నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు'
ఎన్నికల నియామవళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పాలనాధికారి ప్రద్యుమ్న ఎన్నికల సిబ్బందిని హెచ్చరించారు.
మాట్లాడుతున్న కలెక్టర్ ప్రద్యుమ్న
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై రాజకీయ పక్షాలు... ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. ఓటర్ల జాబితా సక్రమంగా ఉంటే... ఎన్నికల విధులు 50 శాతం పూర్తయినట్లేనని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం 1950 టోల్ ఫ్రీ నెంబర్ గురించి ప్రజలకు వివరించాలని ఆదేశించారు. జిల్లాలో 95 వేల దరఖాస్తులొచ్చాయన్న పాలనాధికారి... వీలైనంత త్వరగా పరిష్కరించాలని దిశానిర్దేశం చేశారు.