చిత్తూరు జిల్లా చంద్రగిరిలో రీపోలింగ్ నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తంచేశారు. దీనిపై పార్టీ నాయకులతో చర్చించారు. తాము రీపోలింగ్‌కు అడిగిన బూత్‌లను ఈసీ పరిగణనలోకి తీసుకోకపోవడంపై మండిపడ్డారు. వైకాపా అడిగిన 7 బూత్‌లలో ఐదింటికి ఎన్నికలు జరపడం సరికాదన్నారు. నిబంధనల ప్రకారం తాము అడిగిన వాటిలోనూ మళ్లీ పోలింగ్ జరపాలని కోరారు. ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణి మరోసారి రుజువైందని అభిప్రాయపడ్డారు. రీపోలింగ్‌పై ఈసీకి లేఖ రాయాలని నిర్ణయించారు.
మేం అడిగిన స్థానాల్లోనూ రీపోలింగ్ చేపట్టాలి: చంద్రబాబు
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో రీపోలింగ్ నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తంచేశారు. వైకాపా అడిగిన 7 బూత్‌లలో ఐదింటికి ఎన్నికలు జరపడం సరికాదన్నారు.
సీఎం చంద్రబాబు
ఇవీ చదవండి..