తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికని తిరుపతి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ మోహన్ అన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో ఊహించని విధంగా నిర్ణయం రాబోతుందని అన్నారు. ఎన్నికల్లో వైకాపా వందల కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ.. ఎన్నికల సంఘ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో పులివెందుల రాజకీయాలు తగదన్నారు.
ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఫలితం రాబోతోంది: చింతా మోహన్
తిరుపతి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ మోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో ఊహించని విధంగా నిర్ణయం రాబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
chinta mohan
దేశ రాజకీయాలను శాసించేది కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసుపై జగన్, మోదీలు నోరు విప్పాలని చింతా మోహన్ డిమాండ్ చేశారు. సినీ నటులు చనిపోతే వేగవంతంగా దర్యాప్తు చేసే సీబీఐ రాజకీయ నాయకుల హత్య కేసులో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. 50 ఏళ్ల పాటు సుదీర్ఘంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి నేడు వాహనాలకు డీజల్ కూడాలేని దయనీయస్థితిలో ఉందని పేర్కొన్నారు.