చిత్తూరు జిల్లాలో జోరుగా బ్యాలెట్ ముద్రణ ప్రక్రియ!
ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల పాటు యథాతథంగా నిలిపివేయాలని సాక్షాత్తు ఎన్నికల సంఘం ఆదేశించినా......చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రక్రియలో కీలకమైన బ్యాలెట్ ముద్రణ ప్రారంభమైంది. చిత్తూరు జిల్లా సహకార సంఘం ప్రింటింగ్ ప్రెస్‌తో పాటు....పలు ప్రైవేటు ప్రింటింగ్ ప్రెస్‌లలో బ్యాలెట్ ముద్రణ జోరుగా సాగుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్...ఎన్నికల ప్రక్రియను ఎక్కడికక్కడ నిలిపివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా....జిల్లాలో మాత్రం ప్రక్రియ ఆగలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంల స్థానంలో....బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పోలింగ్ రోజున రిగ్గింగ్, సైక్లింగ్ వంటి కార్యక్రమాలతో అక్రమాలు చోటు చేసుకునేందుకు వీలున్న బ్యాలెట్ పత్రాలను భద్రత లేకుండా ముద్రిస్తుండటం పలు విమర్శలకు దారితీస్తోంది.
ballet printing process in chittoor district