వరికసువుపల్లిలో వ్యవసాయ పరికరాలు దగ్ధం - వరికసువుపల్లిలో వ్యవసాయ పరికరాలు దగ్ధం
చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్ర మండలంలో వరికసువుపల్లిలోని ఓ రైతు పొలంలో వ్యవసాయ ఉపకరణాలు ప్రమాదవశాత్తు కాలిపోయాయి. వెంకటరమణారెడ్డి అనే రైతు పొలంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పైపులు, స్ప్రింకర్లు, డ్రిప్ ఇరిగేషన్, రేయిన్ గన్స్ దగ్ధమయ్యాయి. వీటి విలువ సుమారు 5 లక్షల వరకు ఉంటుందని బాధిత రైతు తెలిపారు. అప్పుచేసి ఈ పరికరాలు కొన్నానని, ఇప్పుడు ఇవి కాలిపోయాయని కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతును ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.