చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం కె.లక్ష్మిరెడ్డిపల్లిలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి తడిసి ఉన్న కోళ్లఫారం గోడ కూలి ఓ బాలుడు మృతి చెందాడు. కరోనా సెలవులు కారణంగా ఇంటి వద్దనే ఉన్న జస్వంత్ తల్లిదండ్రులకు సాయంగా ఉంటుండేవాడు. పశువులను మేపడం కోసం వెళ్లిన జస్వంత్పై కోళ్ల ఫారం గోడ కూలి బాలుడిపై పడింది. తీవ్ర గాయాలపాలైన బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కోళ్లఫారం గోడ కూలి బాలుడు మృతి - boy dead latest news
కోళ్ల ఫారం కోసం నిర్మించిన గోడ వర్షానికి తడిచి బాలుడిపై కూలిపోయింది. దీంతో ఎనిమిదో తరగతి చదువుతున్న ఆ బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన ఘటన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం కె లక్ష్మిరెడ్డిపల్లిలో చోటు చేసుకుంది.

కోళ్లఫారం గోడ కూలి బాలుడు మృతి