ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వి.వి.వినాయక్​కు జీహెచ్​ఎంసీ షాక్.. భవనం కూల్చివేత

సినీ దర్శకుడు వీవీ వినాయక్​కు చెందిన నిర్మాణంలో ఉన్న ఓ భవనాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. రెండంతస్తులకే అనుమతులుండగా.. ఆరంతస్తులు నిర్మిస్తున్నట్లు గుర్తించిన అధికారులు చర్యలు తీసుకున్నారు.

వీవీ వినాయక్

By

Published : Jun 27, 2019, 6:27 AM IST

వి.వి.వినాయక్​కు జీహెచ్​ఎంసీ షాక్

ప్రముఖ సినీ దర్శకుడు వి.వి.వినాయక్‌కు జీహెచ్‌ఎంసీ అధికారులు షాక్‌ ఇచ్చారు. హైదరాబాద్ నగర శివారులోని నార్సింగి ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్‌ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఇందులో భాగంగా వట్టినాగులపల్లి గౌలిదొడ్డిలోని సర్వే నంబర్‌ 223లో రెండు అంతస్తుల భవనం కోసం అనుమతి తీసుకొని ఆరంతస్తుల్లో నిర్మించిన రెండు భవనాలను కూల్చివేశారు. అందులో వినాయక్‌కు చెందిన భవనం కూడా ఉందని నార్సింగి మున్సిపల్‌ కమిషనర్‌ టి.కృష్ణమోహన్‌, మేనేజర్‌ నర్సింహులు వెల్లడించారు. నిర్మాణంలో ఉన్న ఓ భవనాన్ని పూర్తిగా కూల్చివేయగా.. మరో భవనంలో మూడు అంతస్తులు కూల్చివేత పూర్తయిందని తెలిపారు. మిగతా భాగాన్ని కూడా రెండు రోజుల్లో కూల్చివేస్తామని అధికారులు వివరించారు. రెండుసార్లు నోటీసులు జారీ చేసినా ఎవరూ స్పందించలేదని.. ఈ భవనాల నిర్మాణానికి అనుమతి పత్రాలు అధికారుల నుంచి కాకుండా అప్పట్లో సర్పంచ్‌ వద్ద నుంచి తీసుకున్నట్టు తెలిసిందన్నారు. ఈ ప్రాంతంలో మరిన్ని అక్రమ నిర్మాణాలున్నట్టు తేల్చిన మున్సిపల్‌ అధికారులు వాటిని కూడా కూల్చివేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details