సుప్రీం ఆదేశాలను మమతా ధిక్కరిస్తున్నారు: జీవీఎల్
పశ్చిమ బంగాల్ ప్రభుత్వం వ్యవహారించిన తీరు రాజ్యాంగ విరుద్ధమని జీవీఎల్ నరసింహరావు అన్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి సీబీఐని అడ్డుకునే అధికారం లేదన్నారు.
కోల్‌కతాలో పరిణామాలు దురదృష్టకరం జీవీఎల్ నరసింహారావు అన్నారు. బంగాల్‌లో అవినీతిని కాపాడేందుకు మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నాని విమర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం దర్యాప్తు చేస్తున్న సీబీఐని ఆ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు సీబీఐ నడుచుకుంటోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి సీబీఐని అడ్డుకునే అధికారం లేదన్నారు. ఈ చర్య అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమని... బంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మార్గనిర్దేశం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.