మంత్రి నారా లోకేశ్ ఆస్తులు ఎంతంటే.... - chandrababu
ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ స్థిర, చరాస్తులు ప్రకటించారు. స్థిరాస్తులు రూ.66,76,11,020 ఉండగా... చరాస్తుల విలువ రూ.253,68,92,998 ఉన్నట్లు లోకేశ్ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
రాజధాని ప్రాంతం మంగళగిరి నుంచి బరిలోకి దిగుతున్న నారా లోకేశ్ ఆస్తులు మొత్తం రూ.320 కోట్లకు పైగానే ఉన్నాయి. లోకేశ్ శుక్రవారం తెదేపా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాల్లో స్థిర, చరాస్తులు, అప్పుల వివరాలను పొందుపర్చారు. తనపై ఎలాంటి కేసులు లేవని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అఫిడవిట్‌లో తెలిపిన ప్రకారం.. నారా లోకేష్, నారా బ్రాహ్మణి, నారా దేవాన్ష్ పేరిట ఉన్న స్థిర, చరాస్తులు, అప్పుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
చరాస్తులు...
లోకేష్ - రూ.253,68,92,998
బ్రాహ్మణి - రూ.14,40,90,905
దేవాన్ష్ - రూ.3,88,78,778
స్థిరాస్తులు...
లోకేష్ - రూ.66,76,11,020
బ్రాహ్మణి - రూ.18,74,47,246
దేవాన్ష్ - రూ.16,17,32,754
అప్పులు...
లోకేష్ - రూ.5,72,43,517
బ్రాహ్మణి - రూ.3,41,29,673
ఆభరణాలు..
లోకేశ్ సతీమణి బ్రాహ్మణికి రెండున్నర కేజీల బంగారం, 97 కేజీలకు పైగా వెండి ఆభరణాలున్నాయి.