ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంటర్​లో గ్రేడింగ్ విధానానికి ప్రభుత్వం స్వస్తి

ఇంటర్​ ఫలితాల్లో ఇక నుంచి గ్రేడింగ్ బదులుగా మార్కులను ఇవ్వనున్నారు. గ్రేడింగ్​లో ఎదురవుతున్న సమస్యల దృష్ట్యా ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇంటర్​లో గ్రేడింగ్ విధానానికి ప్రభుత్వం స్వస్తి

By

Published : Jun 30, 2019, 5:21 AM IST

ఇంటర్​లో గ్రేడింగ్ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలికింది. గ్రేడింగ్ విధానంలో ఎదురవుతున్న సమస్యల కారణంగా ఈ మేరకు ఇంటర్ విద్యామండలి నిర్ణయం తీసుకుంది. గతంలో మాదిరిగానే మార్కులలను ఇచ్చేందుకు నిర్ణయించింది. మార్కులను నేటి ఉదయం 10 గంటల నుంచి జన్మభూమి వెబ్​సైట్​లో పొందవచ్చని పేర్కొంది.
ఇతర రాష్ట్రాల్లో ప్రవేశాలకు అడ్డంకులు
విద్యార్థుల్లో మార్కులు తగ్గుతున్నాయన్న ఆత్మనూన్యతభావంతో వారు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని వాటిని నిలువరించేందుకు 2017-18 లో ఇంటర్ మెుదటి ఏడాదికి 2018-19లో ద్వితీయ సంవత్సరానికి గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. దింతో మార్కులకు బదులుగా గ్రేడింగ్ పాయింట్లు కేటాయించారు. కానీ ఇతర రాష్ట్రాల్లో ప్రవేశాలు పొందాలంటే గ్రేడింగ్ విధానం వల్ల ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. చాలా రాష్ట్రల్లో మార్కుల విధానం అందుబాటులో ఉండటంతో ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. తాజగా దిల్లీ వర్సటీ కళశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోగా...గ్రేడు పాయింట్లను మార్కులుగా మార్చడంలో ఇబ్బందులు తలెత్తాయి. ఈ విషయాన్ని దిల్లీ వర్సటీ అధికారులు విద్యాశాఖ మంత్రి సురేష్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యపై స్పందించిన ఆయన గ్రేడింగ్ బదులు మార్కులు ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించారు.

ఇంటర్​లో గ్రేడింగ్ విధానానికి ప్రభుత్వం స్వస్తి

ABOUT THE AUTHOR

...view details