సీఎం చంద్రబాబు వ్యవస్థ బాగుకోసం పోరాడుతుంటే... భాజపా నేతలు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్సీ అశోక్‌బాబు దుయ్యబట్టారు. ఎన్నికల సంఘం పనితీరు వివాదాస్పదంగా ఉందని... మోదీ, అమిత్‌షాలకు క్లీన్‌చిట్ ఇవ్వడం ఈసీ మాజీ అధికారులే అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా భాజపా చేసిన అరాచకాల గురించి మాట్లాడే ధైర్యం చేయని నేతలు... చంద్రబాబుపై విమర్శలు చేయడం... వారి కుసంస్కారానికి నిదర్శనమన్నారు.
''ఎన్నికల సంఘం పనితీరు వివాదాస్పదం''
భాజపా నేత మాధవ్ ఎమ్మెల్సీగా గెలవడానికి తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు కృషిచేసిన విషయం మర్చిపోయి... ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదని ఎమ్మెల్సీ పి.అశోక్‌బాబు హితవు పలికారు.
ఎన్నికల సంఘం పనితీరు వివాదాస్పదంగా ఉంది