'ఎంసెట్ అడ్మిషన్ల ప్రక్రియ వేగవంతం చేయాలి'
రాష్ట్రంలో ఎంసెట్ అడ్మిషన్ల ప్రక్రియ త్వరగా ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉన్నత విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
ఎంసెట్‌కు సంబంధించిన ప్రక్రియ విధానాన్ని వేగవంతం చేసి సకాలంలో అడ్మిషన్ల షెడ్యూల్‌ను ప్రకటించాలని సీఎస్ ఆదేశించారు. అమరావతి సచివాలయంలో ఎంసెట్ కు సంబంధించిన అంశాలపై ఉన్నత, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. ఇంటర్మీడియెట్‌లో గ్రేడింగ్ పాయింట్ల విధానం పూర్తి చేసేందుకు, ఇబీసీ రిజర్వేషన్ల కోటాను నిర్ధారించేందుకు ఆయా శాఖల అధికారులతో చర్చించారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు.
ఇవాళ విడుదల కావాల్సిన ఎంసెట్ ఫలితాలను వాయిదా వేశారు. నుంచి ఈ రోజే ఫలితాలు వెల్లడవుతాయంటూ ప్రచారం జరగడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో గందరగోళం నెలకొంది.