అనంతపురం నగరంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఓ ఇంట్లో దొంగలు చొరబడ్డారు. కాలనీకి చెందిన గురుమూర్తి కుటుంబ సభ్యులతో రెండు రోజుల క్రితం వేరే ఊరికి వెళ్లారు. ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయని.. బీరువాలో ఉన్న నగదు, నగలు మాయమయ్యాయని గుర్తించారు. చోరీపై ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీలో చోరీ.. నగదు, నగలు మాయం - అనంతపురం ఇళ్లలో చోరీలు
అనంతపురంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న ఓ ఇంట్లో దొంగలు పడ్డారు. బీరువాలోని నగదు, నగలను ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు.

అనంతపురంలో చోరీ