అనంతపురం జిల్లా లేపాక్షిలో కరోనా లక్షణాలతో దయనీయ స్థితిలో 74 సంవత్సరాల వయసు గల అనంతరావు అనే వృద్ధుడు అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అయితే ప్రైవేటు అంబులెన్స్ సిబ్బంది మృతదేహాన్ని ఆ వ్యక్తి ఇంటి ముందు వదిలేసి బంధువులకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు. కుటుంబసభ్యులు పట్టించుకోకపోవటంతో.... చాలా సేపటి వరకు మృతదేహం ఇంటి ముందే ఉంది. దీంతో స్థానికులు ఆందోళన చెందారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ బలరాం అక్కడికి చేరుకుని మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించారు.
అంబులెన్స్ సిబ్బంది అమానుషం... ఇంటి ముందే కరోనా రోగి మృతదేహం - అనంతపురం కొవిడ్ వార్తలు
కరోనాతో ఓ వృద్ధుడు మృతి చెందటంతో..ఆ మృతదేహాన్ని ఎవరికీ చెప్పకుండా ఆ వ్యక్తి ఇంటి ముందు వదిలేసి వెళ్లిపోయారు ప్రైవేటు అంబులెన్స్ సిబ్బంది. ఈ ఘటన అనంతపురం జిల్లా లేపాక్షిలో చోటుచేసుకుంది.

లేపాక్షిలో దారుణం