అనంతపురం జిల్లా రాయదుర్గంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తెదేపా నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు , మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పూల నాగరాజు, తెదేపా నాయకులతో కలిసి 30వ వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పట్టణ ప్రజలకు తాగునీరు , విద్యుత్ దీపాలు వంటి మౌలిక వసతులు కల్పించడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వారు విమర్శించారు.
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా విశాఖ జిల్లా నర్సీపట్నం పురపాలక పరిధిలో తెదేపా ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఛైర్మన్ పదవితో పాటు 28 వార్డులకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నర్సీపట్నం సీనియర్ నాయకులు తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి ఆయన కుమారుడు రాజేష్ పోటీలో పట్టణంలోని పలు వ్యాపార సంస్థలను కూరగాయల దుకాణం దారుల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తూ తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరించాలని కోరుతున్నారు.