కరోనా సోకిన వ్యక్తులకు సాయం చేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను అనంతపురం జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు సన్మానించారు. కొవిడ్ మృతులకు అంత్యక్రియలు నిర్వహించటంలో, బాధితులకు అండగా నిలవటంలో పలు సంస్థల వాలంటీర్లు ఎనలేని సేవ చేశారని ఆయన అన్నారు. జిల్లాలో సాయి స్వచ్చంద సంస్థ కొవిడ్ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించిందన్నారు. దాదాపు పది స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను శాలువ కప్పి ప్రశంసాపత్రంతో సత్కరించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది, పొరుగు సేవల ఉద్యోగులకు ఎస్పీ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు ఎస్పీ సత్యఏసుబాబు సన్మానం - అనంతపుర జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు సన్మానం
కొవిడ్ బాధితులకు సాయం చేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను అనంతపురం జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు సన్మానించారు. వారి సేవలను ఆయన కొనియాడారు.

sp honor to charitable truct