ఎలక్ట్రానిక్స్ విద్యార్థుల సృజనాత్మకత
అనంతపురం జిల్లా గుంతకల్లు శంకరానంద డిగ్రీ కళాశాల విద్యార్థులు.. సృజనాత్మకత చాటుకున్నారు.
అనంతపురం జిల్లాలోని శ్రీ శంకారానంద డిగ్రీ కళాశాల ఎలక్ట్రానిక్ విభాగం విధ్యార్థులు వినూత్న ఆవిష్కరణలతో ఆకట్టుకున్నారు. కలశాలలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ ఫెయిర్ లో ప్రతిభను చాటారు. ఆధునిక యుగంలో చోటు చేసుకుంటున్న మార్పులు, జీవన విధానంలో ఎల్రక్ట్రానిక్ పరికరాల ప్రాధాన్యత వాటి అవసరాలను వివరిస్తూ ప్రదర్శనలు చేశారు. రవాణా, కాలుష్యం, వ్యవసాయం, పార్కింగ్ సమస్యలు, మున్సిపాలిటీ గార్బేజ్ మేనేజ్మెంట్, రోబోటిక్ ఫైర్ ఫైటింగ్, కాలుష్య నియంత్రణ పద్ధతులు, ల్యాండ్ మైన్ ను దూరంగా ఉండగానే కనిపెట్టే వాహనాలవంటి అధినిక మొదలైన పద్దతులను సూక్ష్మ పద్దతిలో అర్తమయ్యే రీతిలో ప్రదర్శించారు. మరిన్ని ప్రయోగాలను ఆవిష్కరించారు. భవిష్యత్తులో విద్యార్థులకు మరింత ప్రోత్సాహం అందిస్తామని కళాశాల ప్రిన్సిపల్ ఆర్కే నాయుడు చెప్పారు.,అందరికి ఉపయోగ పడే మరిన్ని అవిష్కరనలు కనుగొనే విధంగా మరింత ప్రోత్సాహకాలు అందిస్తామని అన్నారు.