అనంతపురం జిల్లా కదిరి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని తాత్కాలిక షెడ్ల తొలగింపు వ్యవహారం వివాదంగా మారింది. అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వెంకటేష్ కు సంబంధించిన రెండు దుకాణాలను ఆర్టీసీ డిఎం తొలగించారంటూ వెంకటేష్ అనుచరులు ఆందోళనకు దిగారు. డిపో మేనేజర్ రవీంద్రనాథ్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వెంకటేష్ ను ఫోన్ ద్వారా బెదిరించినట్లు ఆయన తెలిపారు. తనకు అనుకూలమైన అభ్యర్థి గెలుపు పై ప్రభావం చూపే అవకాశం ఉందని, అందుకు ప్రతీకారంగానే ఆర్థికంగా దెబ్బ తీసేందుకు దుకాణాలు తొలగించారని వెంకటేష్ వాపోయారు. ఆర్టీసీ డిఎం, తాత్కాలిక షెడ్లను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని వెంకటేష్ ఆర్డీడోవో, డీఎస్పీలకు ఫిర్యాదు చేశారు.
వివాదంగా మారిన తాత్కాలిక షెడ్ల తొలగింపు...! - అనంతపురం జిల్లా
కదిరి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని తన రెండు దుకాణాలను తొలగించారని అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి వెంకటేష్ ఆర్టీడీవో, డీఎస్పీలకు ఆర్టీసీ డిఎంపై ఫిర్యాదు చేశారు.

వివాదంగా మారిన తాత్కాలిక షెడ్ల తొలగింపు
వివాదంగా మారిన తాత్కాలిక షెడ్ల తొలగింపు
ఇవి చూడండి...